
నేపాల్ వరదల్లో మరణించిన మహిళ మృతదేహం నుంచి కమ్మలు దొంగిలించిన మదన్ గురాంగ్, ఉమేశ్ చౌదరీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు.
నేపాల్ వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి చేరగా, 288 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభించలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.