
విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో హోంవర్క్ చేయలేదన్న కోపంతో ఉపాధ్యాయురాలు కొట్టడంతో 6 ఏళ్ల యూకేజీ విద్యార్థి ప్రణయ్‌తేజ్ మృతి చెందాడు.
పాఠశాల సీసీ కెమెరాలో ఉపాధ్యాయురాలు బాలుడి చొక్కా పట్టుకుని లాగుతూ, చెంపపై కొట్టడం రికార్డయింది, ఆ వెంటనే బాలుడు కుప్పకూలి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.