ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే డైరీ ఫుడ్స్, బాదం, ఫ్యాటీ చేపలు, గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలని క్లీవ్లాండ్ క్లినిక్ సూచించింది.
ప్రోటీన్ కోసం బీన్స్, నట్స్, లీన్ మీట్, టోఫు తీసుకోవడం వల్ల ఎముకల కణజాలం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వల్ల కాల్షియం శోషణ తగ్గి ఎముకలు బలహీనపడతాయని, కాబట్టి వీటిని మానుకోవాలని హెచ్చరించారు.