
ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.
సిరిసిల్లలో సుమారు రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లతో పనులు జరుగుతున్నాయని మంత్రులు తెలిపారు.