
విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
సోమవారం వర్కింగ్ డే కావడంతో పాటు రెండ్రోజుల్లో దీపావళి ఉండటంతో నాల్గో రోజు ఇండియాలో రూ. 3.40 కోట్ల నెట్ మాత్రమే వసూలైంది.
ఆదివారం వసూళ్లతో పోలిస్తే దాదాపు 69.8 శాతం తగ్గుదల నమోదవగా, నాలుగు రోజుల్లో రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.