అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ భారీ యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాన సైనిక స్థావరాలను బాహ్య సహాయం లేకుండా కనీసం 90 రోజుల పాటు పనిచేసేలా 'ఫోర్ట్రెస్' కార్యక్రమాన్ని సిద్ధం చేస్తోంది.
ఈ ప్రణాళికలో భాగంగా పోర్టబుల్ అణు రియాక్టర్లు, భారీ స్థాయి బ్యాటరీ నిల్వలు, మైక్రోగ్రిడ్ల ద్వారా విద్యుత్, నీరు, ఇంధన సరఫరాకు నిరంతర చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కీలక రక్షణ పరికరాల కోసం ఒకే సరఫరాదారుపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయడంతో పాటు సివిల్ రిజర్వ్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.