
యూకేలో ఉద్యోగాల పేరుతో రూ.8 కోట్ల మేర మోసాలకు పాల్పడిన యూట్యూబర్ నందనను శంషాబాద్ పోలీసులు సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు.
నిందితురాలు నందన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నిరుద్యోగులను ఆకర్షించి, విదేశీ ఉద్యోగాల పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.