
మురసు తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.
వాతావరణం సహకరించని కారణంగా హెలికాప్టర్ ల్యాండ్ కాకపోయినా, ఏరియల్ వ్యూ ద్వారా పంటలు, జలదిగ్బంధమైన ప్రాంతాలను పరిశీలించారు.
గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.