
అమెరికా సైనికులను చంపినా లేదా పట్టించినా 30 వేల డాలర్ల (సుమారు రూ.28 లక్షలు) రివార్డు ఇస్తామని ఇరాన్ సైన్యం ఆగస్టు 16న ప్రకటించింది.
ఈ పనిని ఇరాన్ మహిళలు చేస్తే వారికి ప్రకటించిన రివార్డుకు రెట్టింపు నగదును బహుమతిగా ఇస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ వెల్లడించారు.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అమెరికాతో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న వేళ ఇరాన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.