పెప్టైడ్ ఇంజెక్షన్లను వైద్య పర్యవేక్షణ లేకుండా జిమ్ సప్లిమెంట్లుగా వాడటం ప్రాణాపాయమని ఎండోక్రైనాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో వాడతారని, అయితే వికారం, వాంతులు, ప్యాంక్రియాటిస్ వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ మహేష్ తెలిపారు.
గర్భిణులు, కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నవారు ఈ ఇంజెక్షన్లకు దూరంగా ఉండాలని, సొంత వైద్యం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.