
హైదరాబాద్ కొండాపూర్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన 36 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదిత్య ఆనంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మార్చి 17న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు జూలై 22న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 75, 78, 79 కింద కేసు నమోదు చేశారు.
భారత పర్యటనలో ఉన్న బాధితురాలు తన బాయ్‌ఫ్రెండ్ గదిలో లేని సమయంలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడని, తిరిగి నెదర్లాండ్స్ వెళ్ళాక రాయబార కార్యాలయానికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు.