
హైదరాబాద్‌లో తొలి విదేశీ విశ్వవిద్యాలయంగా అమెరికాకు చెందిన 'యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్' క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుండగా, ఇందుకు యూజీసీ ప్రాథమిక అనుమతి జారీ చేసింది.
తొలుత బిజినెస్, కంప్యూటింగ్, ఇంజనీరింగ్, ఎనలటిక్స్ వంటి అధిక డిమాండ్ కోర్సులను అందించనున్న ఈ వర్సిటీ, 2027 ఆగస్టులో తొలి బ్యాచ్‌ను ప్రారంభించనుంది.
ఈ క్యాంపస్ ఏర్పాటుకు గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఎమిరటస్ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుందని సీయూ డెన్వర్ ఛాన్స్‌లర్ కెన్నెత్ టీ క్రిస్టెన్సన్ తెలిపారు.