
ఆహారంలో ఉప్పు మోతాదు మించితే శరీరంలో సోడియం పెరిగి రక్తనాళాలపై ఒత్తిడి పడుతుందని, ఇది హై బీపీకి దారితీస్తుందని హెచ్చరించారు.
దీర్ఘకాలిక అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉండటంతో పాటు కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గి వ్యాధులు వస్తాయి.
అధిక సోడియంను శరీరం బయటకు పంపే క్రమంలో కాల్షియం కూడా బయటికిపోయి ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది.