
అనంతపురం జిల్లా కోవూరునగర్‌లో వృద్ధురాలిని హత్య చేసి, చెవులు కోసి కమ్మలు లాక్కెళ్లిన కేసును పోలీసులు 4 గంటల్లోనే ఛేదించారు.
వృద్ధురాలు చిన్న నాగమ్మ(80)ను ఆమె మనవడు నారాయణస్వామి బంగారు చెవికమ్మల కోసం హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
హత్య చేసినట్లు మనవడు అంగీకరించాడని, చెవికమ్మలను దుకాణంలో అమ్మినట్లు గుర్తించామని డీఎస్పీ చెప్పారు.