
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లు పర్యావరణ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తున్నందుకు కాలుష్య నియంత్రణ మండలి రూ.21.01 కోట్ల జరిమానా విధించింది.
పర్యావరణ పరిహారంగా ఈ మొత్తాన్ని చెల్లించాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
గోదావరి నది కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.