
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి నిర్వహించిన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్ విజేతగా రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు నిలిచింది.
మంగళగిరిలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగిల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ చారిత్రాత్మక విజయం సాధించిన రాయలసీమ జెన్ స్టార్స్ జట్టును, రన్నరప్‌గా నిలిచిన గోదావరి గోల్డెన్ ఈగిల్స్‌ను మంత్రి నారా లోకేశ్ అభినందించారు.