
ఐఐటీ బాంబేలో పరీక్ష సమయంలో ఫోన్ వాడుతూ పట్టుబడిన విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యార్థి చాట్‌జీపీటీ ద్వారా సమాధానాలు పొందేందుకు ప్రయత్నించగా ప్రొఫెసర్లు మందలించారని, అయితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ఐఐటీ బాంబే వివరణ ఇచ్చింది.
క్యాంపస్‌లో వరుస మరణాలపై కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తూ తోటి విద్యార్థులు నిరసనకు దిగారు.