
సెప్టెంబర్ 5, 2016న వాణిజ్య సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో, పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 2026 మార్చి నాటికి 52.44 కోట్ల మంది వినియోగదారులను చేరుకుంది.
2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్ఫామ్స్ స్థూల ఆదాయం రూ.1,72,317 కోట్లుగా, నికర లాభం రూ.30,049 కోట్లుగా నమోదైంది.
కేవలం 170 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సాధించిన జియో, ప్రస్తుతం 5G మరియు డిజిటల్ సేవలతో టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది.