
దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై దాడులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.
బిహార్లోని సివాన్ జిల్లాలో జూలై 25న జరిగిన నిరసనల్లో పోలీసులు ఏకే-47తో కాల్పులు జరిపారని, ఢిల్లీలో పెల్లెట్ గన్లు వాడారని ఆయన ఆరోపించారు.
విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలని, దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు.