
హైదరాబాద్లో బోనాల ఉత్సవాల నేపథ్యంలో లాల్ దర్వాజా, అంబర్పేట్, చిలకలగూడ ప్రాంతాల్లో ఆగస్టు 9, 10 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
లాల్ దర్వాజా ఊరేగింపు సందర్భంగా మదీనా ఎక్స్ రోడ్డు నుంచి ఇంజిన్ బౌలి వరకు రహదారిని పూర్తిగా మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులకు చార్మినార్, ఫలక్నుమా వైపు నో ఎంట్రీ ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.