
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మైసా' సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు రష్మిక మందన్న తుంటి భాగంలో గాయపడ్డారు.
వైద్యుల సూచన మేరకు ఆమె ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని, ప్రస్తుతం ఇంట్లోనే కోలుకుంటున్నట్లు తెలిపారు.
గోండు తెగ మహిళ పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.