
తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, శ్రీవారి భక్తుల కోసం రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్, గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.