
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
కర్ణాటకలోని హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తున్న ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా, మృతులు బీదర్ జిల్లా రాజగిరికి చెందినవారిగా గుర్తించారు.
కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.