
30, 40 ఏళ్ల వయసు వారిలో కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, దీనికి ప్రాసెస్డ్ ఫుడ్స్, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణమని డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు.
మలంలో రక్తం పడటం, పదేపదే కడుపునొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
కుటుంబ చరిత్ర ఉన్నవారు 45 ఏళ్ల వయసు నుంచే స్క్రీనింగ్ చేయించుకోవాలని, తద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.