
నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న లవ్ బ్రేకప్ మరియు రెండేళ్ల నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఇబ్బందులపై ధైర్యంగా మాట్లాడటాన్ని అదితి శంకర్ ప్రశంసించారు.
తన తాజా చిత్రం 'వన్స్ మోర్' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అదితి శంకర్, అనుపమ మాటలు టాక్సిక్ రిలేషన్‌లో ఉన్న చాలా మందికి అవగాహన కలిగిస్తాయని పేర్కొన్నారు.
గతంలో 11 మంది పిల్లలు కావాలనుకున్న తాను, మాజీ ప్రియుడి వేధింపుల వల్ల అసలు పిల్లలే వద్దనే స్థాయికి చేరుకున్నానని అనుపమ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.