
2019లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయకపోయి ఉంటే, పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుతూ ఉద్యమించేవారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
శ్రీనగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, పీవోకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపై జరుగుతున్న దాడులు తనను బాధిస్తున్నాయని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీవోకే కోసం కేటాయించిన స్థానాలు ఖాళీగా ఉన్నాయని, భవిష్యత్తులో అవి భర్తీ అవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.