
ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో 'స్కూల్ ఠీక్ కరో' ఉద్యమాన్ని ప్రారంభించారు.
గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 94,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ప్రాథమిక పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని ఆయన విమర్శించారు.
పాఠశాలల స్థితిగతులపై నివేదికలు సేకరించి ప్రభుత్వానికి గడువు ఇస్తామని, స్పందించకుంటే రెండో దశ ఉద్యమాన్ని చేపడతామని దీప్కే ప్రకటించారు.