
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల లంచ్ మీటింగ్‌లో ఆరోపించారు.
ఈ అక్రమాలపై సిట్ (SIT) సమర్పించిన నివేదికను హైకోర్టుకు అందజేసినట్లు పేర్కొంటూ, దీనిపై అసెంబ్లీలో వైసీపీని నిలదీయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించిందని, వైసీపీ నేతల విమర్శలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.