
జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య, నజ్రియా నజీమ్ జంటగా నటించిన ‘సీన్’ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 6న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్న సూర్య తన భార్య జ్యోతికపై ప్రశంసలు కురిపించారు.
తన కెరీర్‌లో తను చాలా తప్పులు చేశానని, ప్రతి అడుగులోనూ తన చేయి పట్టుకుని నడిపించింది జ్యోతికనే అంటూ సూర్య ఎమోషనల్ అయ్యారు.