
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో 12 వికెట్లతో అదరగొట్టిన యువ స్పిన్నర్ శ్రీచరణి, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది.
తాజాగా 804 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న శ్రీచరణి, ఆల్‌టైమ్ టాప్ రేటింగ్ పాయింట్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు ఆసియా కప్‌లో 14 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకోగా, టాప్-2 స్థానాలను భారత బౌలర్లే కైవసం చేసుకున్నారు.