
తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను నెలకొల్పడమే లక్ష్యమని, 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.1,08,000 ఖర్చు చేస్తోందని, విద్యా సంస్కరణల వల్ల గత మూడేళ్లలో డ్రాపౌట్స్ తగ్గి అడ్మిషన్లు పెరిగాయని ఆయన తెలిపారు.
ఫిన్‌లాండ్, జర్మనీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.