నాగపట్టినం జిల్లా విళుందమావడి మత్స్యకార గ్రామంలో మద్యం బారిన పడుతున్న యువతను కాపాడేందుకు గ్రామ పెద్దలు ఆగస్టు 2 నుంచి కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చారు.
పెళ్లికాని యువకులు మద్యం సేవిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని, అలాగే తాగి గొడవలు చేసే ఇతరులపై కూడా అదే స్థాయిలో ఫైన్ వేస్తామని గ్రామ పంచాయతీ ప్రకటించింది.
గ్రామంలోని 5,000 కుటుంబాలు ఈ నిర్ణయానికి మద్దతు తెలపగా, మద్యం రహిత గ్రామంగా మార్చేందుకు మైకుల ద్వారా ప్రచారం చేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.