
కెనడాలో పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఒక చిన్నారి సీటు బెల్టు పెట్టుకోవడానికి నిరాకరించడంతో విమాన సర్వీసును రద్దు చేశారు.
విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో చిన్నారి సీటుపై నిలబడి మారాం చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.