
తెలుగు సినీ దర్శకుడు ప్రదీప్ అద్వైతం భార్య దీప్తి రెడ్డి (42) అనారోగ్యంతో కన్నుమూశారు.
శనివారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గతంలోనే జూన్‌లో అవయవ దానానికి ప్రతిజ్ఞ చేసిన ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు అవయవదానానికి సమ్మతించారు.