
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్, నరీన్ ఖాన్లను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలుకు తరలించారు.
సెప్టెంబర్ 27న పీటీఐ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ప్రజా శాంతి పరిరక్షణ చట్టం కింద వీరిని 30 రోజుల పాటు నిర్బంధించేందుకు లాహోర్ డిప్యూటీ కమిషనర్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిరసన పిలుపు చట్టవిరుద్ధమని, రహదారులను దిగ్బంధించి ప్రజల జీవితాలకు అంతరాయం కలిగించేందుకు అనుమతించబోమని పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ పేర్కొన్నారు.