
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికలకు భారీగా అదనపు ఈవీఎంలు అవసరమవుతుండటంతో, బ్యాలెట్ పద్ధతినే ఎంచుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది.
మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికలు కూడా ప్రత్యక్ష విధానంలో జరుగుతుండటంతో, బ్యాలెట్ పేపర్ల వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించడంపై అధికారులు దృష్టి సారించారు.