
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీ ప్రాజెక్టుకు సమీపంలోని థిలాఫుషి పోర్ట్ అభివృద్ధిని చైనా కంపెనీకి అప్పగించారు.
భారత్ 400 మిలియన్ డాలర్ల రుణం, 100 మిలియన్ డాలర్ల గ్రాంట్తో గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది.
గతంలో భారత్ నుంచి ఆర్థిక సాయం పొందిన ముయిజ్జు, ఇప్పుడు వ్యూహాత్మక ప్రాజెక్టును చైనాకు ఇవ్వడంపై భౌగోళిక రాజకీయ చర్చ మొదలైంది.