
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత చింతాడ రవికుమార్‌ను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ ముందు లొంగిపోయేందుకు వెళ్తుండగా తనను పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని రవికుమార్ ఆరోపించారు.
తన అనుచరులను, కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధిస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు.