
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఈ ఏడాది ఇప్పటివరకు 281 కంపెనీల్లో 1,27,180 మంది ఉద్యోగాలు కోల్పోగా, అందులో కేవలం ఏఐ, ఆటోమేషన్ కారణంగా 111 కంపెనీలు 97,473 మందిని తొలగించాయి.
మొత్తం లేఆఫ్స్‌లో ఏఐ వాటా గతేడాది 29 శాతంగా (35,534 మంది) ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 77 శాతానికి పెరిగిందని అంతర్జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
చాట్-జీపీటీ, క్లాడ్, జెమినై వంటి జనరేటివ్ ఏఐ సాధనాల వాడకం పెరగడంతో కస్టమర్ సపోర్ట్, బేసిక్ కోడింగ్, కంటెంట్ రైటింగ్, హెచ్ఆర్ విభాగాల్లో మానవ వనరుల అవసరం వేగంగా తగ్గుతోంది.