
ఒక ఆర్థిక సంవత్సరంలో కొనుగోలుదార్ల సంఖ్య 200 మించనంతవరకు అన్‌లిస్టెడ్ షేర్ల బదిలీని పబ్లిక్ ఇష్యూగా పరిగణించబోమని సెబీ స్పష్టం చేసింది.
వాటాదార్లు ప్రైవేట్ చర్చల ద్వారా ఆఫ్-మార్కెట్‌లో షేర్లను విక్రయించుకోవచ్చని మార్కెట్ల నియంత్రణ సంస్థ తెలిపింది.
ఈ నిబంధన అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్ల లావాదేవీలకు వర్తిస్తుందని సెబీ పేర్కొంది.