
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 6 వారాల గరిష్ఠానికి చేరి, పీపా 97.93 డాలర్లకు పెరిగింది.
గత వారంలో బ్రెంట్ క్రూడ్ 8 శాతం, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 10 శాతం పెరిగాయని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక పేర్కొంది.
హోర్ముజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం కలిగితే చమురు ధరలు 120 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.