
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.
డిసెంబర్లో జరిగే ఈ దేశవాళీ వన్డే టోర్నీలో పాల్గొంటానని ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం అందించారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ప్రోత్సహిస్తోంది.