యూఏఈ ప్రభుత్వం పాకిస్థానీలకు వీసాల జారీని నిలిపివేసిందని, దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని పాక్ వ్యాపారవేత్తలు ఆరోపిస్తున్నారు.
అధికారికంగా ఎటువంటి నిషేధం లేదని యూఏఈ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వీసాలు రావడం లేదని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది సౌదీతో పాకిస్థాన్ చేసుకున్న రక్షణ ఒప్పందం తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని నివేదికలు పేర్కొంటున్నాయి.