ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవిలను ప్రభుత్వం ఖరారు చేసింది.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడైన వర్ల రామయ్య ఎస్సీ సామాజికవర్గం నుంచి, దళవాయి రమాదేవి బీసీ సామాజికవర్గం నుంచి ఈ పదవులకు ఎంపికయ్యారు.
పండుల రవీంద్రబాబు, జకియా ఖానం పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులతో భర్తీ చేసింది.