
నేడు అన్ని డిజిటల్ చెల్లింపులకు విరివిగా వాడుతున్న క్యూఆర్ కోడ్‌ను డిజిటల్ పేమెంట్స్ కోసం కాకుండా కార్ల తయారీలో విడిభాగాలను గుర్తించేందుకు రూపొందించారు.
ఈ క్యూఆర్ కోడ్‌ను జపాన్‌కు చెందిన డెన్సో వేవ్ సంస్థ టయోటా కార్ల ఫ్యాక్టరీల అవసరాల కోసం 1994లో అభివృద్ధి చేసింది.
సాధారణ బార్కోడ్లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేయగలగడం మరియు వేగంగా స్కాన్ చేయడం దీని ప్రత్యేకత.