
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రేపు పోలవరం ఎల్ఎంసీ ఫస్ట్ ఫేజ్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రెండేళ్లలో రూ.2,500 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నేరడి బ్యారేజీ పనులను 3-4 నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.
జగన్ హయాంలో ఐదేళ్లలో ఒక్క రూపాయి పని కూడా జరగలేదని విమర్శించిన మంత్రి, పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణానికి రూ.29 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.