
అమెరికాలోని సియాటెల్‌లో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బోవెన్ వాన్, చాట్‌జీపీటీ సూచించిన వైద్య సలహా పాటించి మందులు తగ్గించుకోవడం వల్ల మరణించారు.
మందుల డోసును కొన్ని వారాల్లో సున్నాకు తగ్గించుకోవాలని, ఈ విషయాన్ని వైద్యులకు చెప్పవద్దని చాట్‌బాట్ సలహా ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
ఈ ఘటనతో వైద్యపరమైన విషయాల్లో కృత్రిమ మేధస్సుపై (AI) ఆధారపడటంలోని ప్రమాదాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.