
ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు గౌతమి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రమోట్ చేస్తూ రీల్స్ చేసినందుకు విద్యాశాఖ ఆమెను 6 నెలల పాటు సస్పెండ్ చేసింది.
తిరిగి విధుల్లో చేరిన తర్వాత సహోద్యోగుల వేధింపులు, అధికారుల అవమానాలు, నెటిజన్ల ట్రోలింగ్‌ను తట్టుకోలేక 12 ఏళ్ల సర్వీసు ఉన్న ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.