
కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి - విజయ డెయిరీ నూతన ఛైర్మన్గా దాసరి వెంకట బాలవర్ధనరావు ఎన్నికయ్యారు.
ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు డెయిరీ వర్గాలు వెల్లడించాయి.
నూతన ఛైర్మన్ ఎన్నికతో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.