
గోళ్లపై ఉండే అర్ధచంద్రాకారం (నెలవంక) కనుమరుగవ్వడం లేదా రంగు మారడం వంటి లక్షణాలు కిడ్నీ మరియు గుండె సంబంధిత సమస్యలను సూచించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
గోళ్లలో మార్పులతో పాటు పాదాల వాపు, అలసట, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
అయితే కేవలం గోళ్ల మార్పుల ఆధారంగానే వ్యాధిని నిర్ధారించలేమని, రక్తహీనత, థైరాయిడ్ మరియు డయాబెటిస్ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు.